ETV Bharat / bharat

దిల్లీ గజగజ.. సీజన్​లోనే ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి

శీతలగాలులు దిల్లీని గజగజ వణికిస్తున్నాయి. ఈ శీతాకాలంలోనే దేశ రాజధానిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజస్థాన్​లోని మౌంట్​అబు పర్వత ప్రాంతంలో తొలిసారి మంచుగడ్డలు దర్శనమిచ్చాయి.

Cold wave sweeps Delhi, minimum temp dips to 3.4 deg C
దిల్లీ గజగజా...శీతాకాలంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
author img

By

Published : Dec 20, 2020, 12:18 PM IST

శీతలగాలులు దేశ రాజధానిని వణికిస్తున్నాయి. దిల్లీలో ఆదివారం.. అత్యల్ప పగటి పూట ఉష్ణోగ్రత 3.4 డిగ్రీల సెంటీగ్రేడ్​ నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. శనివారం మాత్రం 3.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది.

ఐఎండీ ప్రకారం.. కనిష్ఠ ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ, గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కన్నా 4.4 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయితే ఆ రోజును చలిరోజుగా పరిగణిస్తాం. అంత కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైతే తీవ్రచలి రోజుగా పేర్కొంటారు.

కొద్ది రోజులుగా దిల్లీలో శీతలగాలులు విజృంభిస్తున్నాయి. ఈ కారణంగా.. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

రాజస్థాన్​లో..

చలిగాలులతో రాజస్థాన్​లోని మౌంట్​ అబూ పర్వత ప్రాంతం మనాలీని తలపిస్తోంది. అక్కడ మంచు గడ్డలు దర్శనమిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఈ కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ 1 డిగ్రీల సెల్సియస్​గా నమోదవుతోంది.

beautiful scene in rajasthan
రాజస్థాన్​లోని ఆహ్లాదకర దృశ్యం
ice cubes in mountabu
మంచుగడ్డలు

యూపీలో..

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోనూ చలి విజృంభిస్తోంది. రైల్వే స్టేషన్ సహా పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది.

fog in waranaasi
వారణాాసిలో పొగ మంచు

ఇదీ చూడండి : మంచు తెరలతో శోభాయమానంగా తిరుమల గిరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.