పార్లమెంట్ ఉభయ సభల ఆమోదముద్ర పడిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గురువారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది.
పౌరసత్వ చట్టం ప్రకారం పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొని దేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం లభించనుంది. 2014 డిసెంబర్ 31కి ముందు దేశంలోకి వచ్చిన వారికి ఈ అవకాశం లభిస్తుంది.
లోక్సభలో సోమవారం ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చూడండి: 'పౌర' సెగ: పోలీసు కాల్పుల్లో ఇద్దరు మృతి