10, 12వ తరగతి ఫలితాలను సీఐసీఎస్‌ఈ విడుదల చేసింది. పదో తరగతిలో 99.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 12వ తరగతిలో 96.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సీఐసీఎస్‌ఈ వెల్లడించింది. ఫలితాలను తమ వెబ్‌సైట్లో చూసుకోవాలని పేర్కొంది.
అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది మెరిట్ జాబితాను ప్రచురించలేకపోతున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
ఈ ఏడాది వేసవిలో నిర్వహించాల్సిన 10, 12వ తరగతి పరీక్షలు కరోనా సంక్షోభం కారణంగా వాయిదా పడి అనంతరం రద్దయ్యాయి. గత పరీక్షల్లో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించారు. మూడు పరీక్షల్లో సగటు ఆధారంగా ఫైనల్ మార్కులు ఖరారు చేశారు.