ETV Bharat / bharat

మోదీ ప్రసంగాన్ని తొలగించిన చైనా సామాజిక మాధ్యమాలు - modi latest updates

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రుల సమావేశంలో చేసిన ప్రసంగాన్ని చైనా సామాజిక మాధ్యమాలు డిలీట్​ చేశాయి. భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వ్యాఖ్యలను కూడా తొలగించాయి.

Chinese social media sites delete PM's speech, MEA spokesman's remarks on border crisis
మోదీ స్పీచ్​ను డిలీట్ చేసిన చైనా సామాజిక మాధ్యమాలు
author img

By

Published : Jun 20, 2020, 10:00 PM IST

గల్వాన్ ​లోయలో భారత సైనికుల మృతికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని చైనా సామాజిక మాధ్యమాలు విచాట్, సినో వీబోలు తొలగించించాయి. ఈ విషయాన్ని బీజింగ్​లోని రాయబార కార్యాలయం తెలిపింది. ఇదే అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవస్తావ చేసిన వ్యాఖ్యలను కూడా తొలగించినట్లు వెల్లడించింది.

జూన్​ 18న ముఖ్యమంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​ వేదికగా సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు మోదీ. అమర జవాన్ల త్యాగం వృథా కాదన్నారు. భారత్​ శాంతిని కోరుకుంటోందని, అదే సమయంలో అవసరమైతే ప్రత్యర్థికి తగిన రీతిలో బుద్ధి చెప్పగల సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. ఈ స్పీచ్​ను బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం సినో వీబో, విచాట్​ అధికారిక ఖాతాల్లో షేర్ చేసింది. అయితే ఆ రెండు సామాజిక మాధ్యమ సంస్థలు.. మోదీ ప్రసంగాన్ని తొలగించాయి.

సినో వీబోకు చైనాలో ట్విట్టర్​కు ఉన్నంత అదరణ ఉంది. విదేశీ రాయబార కార్యాలయాలు, ఇతర దేశాల అధినేతలు చైనా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ ఖాతాలను తెరిచారు. భారత రాయబార కార్యాలయం పేజీని వేలాది మంది చైనీయులు అనుసరిస్తున్నారు. మోదీ స్పీచ్​ తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందనే కారణంతోనే తొలగించినట్లు రెండు సామాజిక మాధ్యమ సంస్థలు తెలిపాయి.

భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ వ్యాఖ్యలను కూడా తొలగించాయి సీనో వీబో, విచాట్​. చైనా తమ కార్యకలాపాలను వాస్తవాదీన రేఖకు అవతలి వైపే కొనసాగించాలని శ్రీవాత్సవ అన్న మాటలను జూన్ 18న భారత రాయబార కార్యాలయం ఖాతా నుంచి డిలీట్​ అయ్యాయి.

వీబో అధికారిక ఖాతాను కొన్నేళ్ల ముందే ప్రారంభించింది భారత రాయబార కార్యాలయం. విచాట్​ ఖాతాను ఈ ఏడాది జనవరిలో తెరిచింది.

చైనా ప్రజలకు చేరువయ్యేందుకు వీబో అధికారిక ఖాతాను 2015లో బీజింగ్​ పర్యటన సందర్బంగా ప్రారంభించారు మోదీ. అయితే ఇటీవలి సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించిన ఏ విషయాన్ని ఆయన పోస్ట్​ చేయలేదు.

ఇదీ చూడండి: చైనా.. నీ తీరు ఎన్నటికైనా మారేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.