ETV Bharat / bharat

గల్వాన్‌ నదిని కప్పేయడానికి చైనా కుట్ర - Disturb Flow Of Galwan River

గల్వాన్​ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటానికి చైనా ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున భారీ బుల్డోజర్లను మోహరించింది. ఓ ప్రముఖ ఛానల్లో సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ దృశ్యాలు కనిపించాయి.

Chinese Bring In Bulldozers, Disturb Flow Of Galwan River: Satellite Pics
గల్వాన్‌ నదిపై భారీ ఎత్తున మోహరించిన చైనా బుల్డోజర్లు
author img

By

Published : Jun 19, 2020, 6:58 AM IST

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి చైనా దుర్బుద్ధి బయటపడుతూనే ఉంది. తాజాగా ఈశాన్య లద్దాఖ్‌ ప్రాంతంలో గల్వాన్‌ నదిని కప్పేయడానికి లేదా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి చైనా పెద్దఎత్తున ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ‘ఎన్‌డీటీవీ’ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. దాడికి తెగబడిన ప్రాంతానికి కిలో మీటరు లోపలే ఆ దేశం ఈ దురాగతానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. చైనా వైపు ఎల్‌ఏసీ వెంబడి భారీగా బుల్డోజర్లు మోహరించి ఉన్నాయి. ఆ ప్రాంతంలో గల్వాన్‌ నదీ ప్రవాహ గతి కూడా మారుతోంది.

భారత్‌ వైపు ఎల్‌ఏసీ ప్రాంతానికి వచ్చేసరికి నీటి ప్రవాహం కుంచించుకుపోవడమే కాకుండా బురదగా కనిపిస్తోంది. 5 కి.మీ.లకు పైగా చైనా ట్రక్కులు, సైనిక వాహనాలు, బుల్డోజర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. గల్వాన్‌ లోయలో ఇప్పటికైతే నదీ ప్రవాహం కొనసాగుతున్నట్లు భారత సీనియర్‌ సైనికాధికారులు 'ఎన్‌డీటీవీ'కి తెలిపారు.

మరోవైపు గల్వాన్‌ లోయలో భారత సైనిక వాహనాలు(ట్రక్కులు) ఎల్‌ఏసీకి 2 కి.మీ.ల లోపల మోహరించి ఉన్నాయి. ఇవన్నీ నీళ్లులేని నదీ ప్రాంతంలో (డ్రై రివర్‌ బెడ్‌) నిలిపి ఉన్నాయి. లోయలోని ఈ దృశ్యాల ద్వారా రెండు దేశాలు అన్నివిధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు సంకేతాలందుతున్నాయి. రెండు ప్రాంతాల్లోనూ వసతి కోసం ముందస్తుగా వేసిన శిబిరాలు కనిపిస్తున్నాయి

ఇదీ చూడండి:ఇరాక్​: అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్​ దాడులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.