భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందా? అనే విషయంపై ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజం చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోదీ వ్యాఖ్యలు.. ఉపగ్రహ చిత్రాల్లో వాస్తవాలు వేరువేరుగా ఉంటే, అది చైనాకే లాభమని తెలిపారు.
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో అమరులైన జవాన్ల గౌరవార్థం కాంగ్రెస్ చేపట్టిన "స్పీక్ అప్ ఫర్ జవాన్స్" కార్యక్రమంలో భాగంగా ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు రాహుల్. దేశమంతా ఐకమత్యంతో మోదీ వెంట ఉంటుందని తెలిపిన రాహుల్.. చైనాను భారత భూభాగం నుంచి వెనక్కి పంపాల్సిందేనని స్పష్టం చేశారు.
-
प्रधानमंत्री जी,
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
देश आपसे सच सुनना चाहता है।#SpeakUpForOurJawans pic.twitter.com/tY9dvsqp4N
">प्रधानमंत्री जी,
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2020
देश आपसे सच सुनना चाहता है।#SpeakUpForOurJawans pic.twitter.com/tY9dvsqp4Nप्रधानमंत्री जी,
— Rahul Gandhi (@RahulGandhi) June 26, 2020
देश आपसे सच सुनना चाहता है।#SpeakUpForOurJawans pic.twitter.com/tY9dvsqp4N
"చైనా మన భూభాగాన్ని ఆక్రమించలేదని మీరు(మోదీ) అంటున్నారు. కానీ మీ వ్యాఖ్యలు అబద్ధమైతే అది చైనాకే లాభం. మోదీజీ.. భయపడకుండా మాట్లాడండి. దేశ ప్రజలకు మీరు నిజం చెప్పాల్సిందే. 'చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది.. కానీ మేము పోరాడతాము' అని చెప్పడానికి భయపడకండి. దేశం మొత్తం మీ వెన్నంటే ఉంటుంది."
--- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
'అలా ఎందుకు చేశారు?'
గల్వాన్ లోయ ఘటనను ప్రస్తావిస్తూ... అసలు ఆయుధాలు లేకుండా జవాన్లను చైనీయులపైకి ఎవరు పంపారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సైనికులు వీరమరణం పొందిన ప్రాంతం భారత్‌దేనని... దాన్ని మోదీ చైనాకు అప్పగించకూడదని తేల్చిచెప్పారు. అన్ని ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ప్రియాంక.
ఇదీ చూడండి:- 'అదే నిజమైతే.. 20 మంది ఎందుకు అమరులయ్యారు?'