ETV Bharat / bharat

చైనా నుంచి భారత్​కు 6.5 లక్షల కరోనా టెస్టింగ్​ కిట్లు

చైనా నుంచి 6,50,000 కరోనా టెస్టింగ్​ కిట్లు భారత్​కు బయలు దేరాయి. వీటిలో 3 లక్షలు రాపిడ్ యాంటీ బాడీ టెస్టింగ్ కిట్లు, ఆర్​ఎన్ఏ ఎక్స్​ట్రాక్షన్ కిట్లు లక్ష ఉన్నాయి.

china-dispatches-650000
చైనా నుంచి దేశానికి 6.5 లక్షల కరోనా టెస్టింగ్​ కిట్లు
author img

By

Published : Apr 16, 2020, 11:10 AM IST

భారత్​లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ చైనా 6.5 లక్షల టెస్టింగ్​ కిట్లు దేశానికి పంపింది. ఇవి ఈ రోజు సాయంత్రానికి భారత్​ చేరే అవకాశం ఉంది. మహమ్మారిపై దేశం చేస్తోన్న పోరాటంలో ఇవి ఎంతగానో సహాయపడతాయని చైనాలో భారత రాయబారి విక్రమ్​ మిశ్రీ అభిప్రాయపడ్డారు.

15 రోజుల్లో మరో 20 లక్షలకు పైగా టెస్టింగ్​ కిట్లను భారత్​కు చైనా పంపనున్నట్లు ఆయన తెలిపారు.

కిట్​ వివరాలు...

  • మొత్తం కిట్ల సంఖ్య- 6,50,000
  • రాపిడ్​ యాంటీ బాడీ టెస్టింగ్​ కిట్లు- 3 లక్షలు
  • ఆర్ఎన్​ఏ ఎక్స్​ట్రాక్షన్​ కిట్లు- 2.5 లక్షలు

ఎగుమతులపై...

కరోనాపై 2 నెలల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రస్తుతం చైనా వ్యాపారంపై దృష్టి పెట్టింది. వైద్య పరికరాలు ముఖ్యంగా వెంటిలేటర్లు, వ్యక్తిగత రక్షణ పరికరాలను భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తోంది.

భారత్​కు వీటి ఎగుమతిలో బీజింగ్​లోని భారత రాయబార కార్యాలయం, గ్వాంగ్​జోవ్​లోని కాన్సులేట్​ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.