ఇలా సాగింది...
ఏడాదిన్నర చిన్నారి నదీమ్ బుధవారం సాయంత్రం ఆడుకుంటూ బోరుబావిలో పడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. జేసీబీ, క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, సైన్యాన్ని రంగంలోకి దింపారు.
ఎట్టకేలకు రెండు రోజులపాటు తీవ్రంగా కష్టపడి శుక్రవారం మధ్యాహ్నం చిన్నారి సమీపానికి చేరుకోగలిగారు. యంత్రాలతో తవ్వకం ఆపేసి మనుషుల ద్వారా తవ్వకాలు జరిపారు. నైట్ విజన్ కెమెరాల సహాయంతో చిన్నారి కదలికలను గమనిస్తూ పనులు చేపట్టారు అధికారులు.పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేశారు. బిస్కెట్లు, జ్యూస్ పంపించారు.
గురువారం చిన్నారిని బయటకు తీసేందుకు వల సహాయంతో యత్నించారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
బోర్వెల్స్పై సర్వే...
నదీమ్ ఘటనతో హిసార్ జిల్లాలోని బోర్వెల్స్పై సర్వేకు ఆదేశించారు అధికారులు. త్వరలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
2006లో కురుక్షేత్రలోని బోరుబావిలో పడిన ఓ పిల్లాడిని రక్షించేందుకు అధికారులు భారీ ఆపరేషన్నే నిర్వహించారు. 48 గంటల అనంతరం ఆ బాలుడిని రక్షించారు.
ఇదీ చూడండి:భవనం కూలిన ఘటనలో 13కు మృతుల సంఖ్య