ETV Bharat / bharat

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు - హరియాణా

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. అక్టోబర్​ 21న రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు
author img

By

Published : Sep 21, 2019, 12:29 PM IST

Updated : Oct 1, 2019, 10:48 AM IST

మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు

మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. నవంబర్​లో రెండు రాష్ట్రాల ప్రస్తుతం అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికల తేదీలను ప్రకటించింది భారత ఎన్నికల సంఘం. మహారాష్ట్రలో 288 స్థానాలు, హరియాణాలో 90 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల ప్రధాన అధికారి సునీల్​ అరోడా ప్రకటించారు.

అక్టోబర్​ 21న పోలింగ్ నిర్వహించనున్నట్లు దిల్లీలో వెల్లడించారు సునీల్. 24న ఫలితాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో 8.94 కోట్లు, హరియాణాలో 1.82 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు సునీల్.

" మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్​ సెప్టెంబర్​ 27 విడుదల కానుంది. నామినేషన్లకు అక్టోబర్​ 4 చివరి తేదీ. అక్టోబర్​ 5న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్​ 7 వరకు గడువు. రెండు రాష్ట్రాలకు అక్టోబర్​ 21న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు 24న జరుగుతుంది. "

- సునీల్​ అరోడా, భారత ప్రధాన ఎన్నికల అధికారి.

2014లో ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించి అధికారాన్ని చేజిక్కించుకుంది.

మహారాష్ట్ర..

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో అధికారం చేపట్టేందుకు 145 సీట్లు అవసరం. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భాజపా 122 సీట్లలో విజయం సాధించింది. శివసేన 63 సీట్లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ 42 స్థానాలకే పరిమితమైంది.

నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (ఎన్​సీపీ) 41, సమాజ్​వాదీ పార్టీ 1, రాష్ట్రీయ సమాజ్​ పక్ష్​ 1, మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేనా 1, సీపీఎం 1, పీడబ్ల్యూపీ 3, బహుజన్ వికాస్​ అఘడి 3, స్వతంత్రులు 7 స్థానాల్లో గెలుపొందారు.

హరియాణా..

హరియాణాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90. అధికారం చేజిక్కించుకునేందుకు 46 సీట్లు అవసరం. 2014 ఎన్నికల్లో భాజపా 47 స్థానాల్లో గెలిచి శిరోమణి అకాలీ దళ్​ (ఎస్​ఏడీ)తో జట్టు కట్టు అధికారాన్ని చేపట్టింది.

కాంగ్రెస్​ 15, ఇండియన్​ నేషనల్​ లోక్​దళ్​ 19, హరియాణా జన్​హిత్​ కాంగ్రెస్​ (బీఎల్​) 2, బహుజన సమాజ్​ పార్టీ 1, శిరోమని అకాలిదళ్​ 1, స్వతంత్రులు 5 స్థానాల్లో గెలుపొందారు.

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: NO standalone digital clips allowed.
SHOTLIST: Progressive Field, Cleveland, Ohio, USA. 20th September 2019.
1. 00:00 Aerial of stadium
Top of the 7th inning:
2. 00:12 Yu Chang double for Indians
3. 00:39 Oscar Mercado single, Chang scores for Indians and 5-2
SCORE: Cleveland Indians 5, Philadelphia Phillies 2
SOURCE: MLB
DURATION: 00:58
STORYLINE:
Yu Chang doubled and scored a run in the Cleveland Indians' 5-2 win over the Philadelphia Phillies Friday night.
Last Updated : Oct 1, 2019, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.