ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్.. రైతు సంక్షేమం కోసం 'గోధన్ న్యాయ్ యోజన్'ను ప్రారంభించారు. ఇందులో భాగంగా రైతుల దగ్గర నుంచి ఆవు పేడను కిలో రూ.2 చొప్పున కొనుగోలు చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా సేకరించిన ఆవు పేడ ద్వారా వర్మీ కంపోస్ట్‌ను ఉత్పత్తి చేసి, సహకార సంఘాల ద్వారా కావల్సిన వారికి విక్రయిస్తారు. ఫలితంగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం సహా.. పశువులకు సరైన గ్రాసం, నీరు లభించడంవల్ల యజమానులకూ అదనపు లాభం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాల ప్రారంభానికి ముందు నిర్వహించే 'హరేలీ' ఉత్సవంలో భాగంగా ఈ పథకం ప్రారంభించారు భూపేశ్. అదే కార్యక్రమంలో రెండు కర్రల సాయంతో సరదాగా నడిచి అలరించారు.
ఇదీ చదవండి: అంగన్వాడి.. సరికొత్త హంగులతో రెడీ