ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​- ఓ నక్సలైట్, ఇద్దరు జవాన్లు మృతి - encounter in bastar Chattisgarh

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ డివిజన్​లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఓ నక్సలైట్ హతమయ్యాడు. సీఆర్​పీఎఫ్​లోని కోబ్రా విభాగానికి చెందిన ఇద్దరు​ జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.

chattisgarh
ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Feb 10, 2020, 2:50 PM IST

Updated : Feb 29, 2020, 9:00 PM IST

ఛత్తీస్​గఢ్​లోని బస్తర్​ డివిజన్​లో నక్సలైట్లకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఓ నక్సల్​తో పాటు సీఆర్​పీఎఫ్​లోని కోబ్రా విభాగానికి చెందిన జవాన్లు​ మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

"ఓ నక్సలైట్​ మరణించాడు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నలుగురు కోబ్రా కమాండోలు గాయపడ్డారు. అందులో ఇద్దరు మృతిచెందారు."-సీఆర్​పీఎఫ్​ అధికారులు

ఉదయం 10:30 గంటలకు సుక్మా, బిజాపూర్​ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇరాపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ ఇద్దరిలో ఒకరు డిప్యూటీ కమాండో హోదా ఉన్న అధికారి ఉన్నట్లు వెల్లడించారు.

Last Updated : Feb 29, 2020, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.