ఛత్తీస్గఢ్ జిల్లాలో నక్సల్స్ మళ్లీ దొంగదెబ్బ తీశారు. కాంకేర్ జిల్లాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లుపై కాల్పులతో విరుచుకుపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతి చెందిన నలుగురిలో ఒకరు బీఎస్ఎఫ్ ఎస్సై.మరో ముగ్గురు కానిస్టేబుళ్లు. మృతదేహాల్ని, క్షతగాత్రుల్ని మహ్లాలోని బీఎస్ఎఫ్ క్యాంపునకు తరలించారు.
మహ్లాకు సమీపంలోని అటవీప్రాంతంలో స్థానిక పోలీసులతో కలసి బీఎస్ఎఫ్ అధికారులు కూంబింగ్ చేస్తున్నారు. అడవిలో నక్కిన నక్సల్స్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఆత్మరక్షణ నిమిత్తం జవాన్లూ తిరిగి కాల్పులు జరిపారు.