కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొద్దిరోజులుగా జపాన్ నిర్బంధంలో ఉన్న క్రూయిజ్ షిప్‌లోని భారతీయులకు త్వరలోనే విముక్తి కలగనుంది. వారిని ప్రత్యేక విమానం ద్వారా స్వదేశానికి తరలించనున్నారు. ఈ మేరకు జపాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
నౌకలో ప్రస్తుతం 138 మంది భారతీయులు ఉన్నారు. వైరస్ సోకలేదని వైద్య బృందం క్లీన్చిట్ ఇచ్చిన వారందిరినీ భారత్‌కు పంపనున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు అధికారులు.
మరో ఇద్దరికి...
క్రూయిజ్ షిప్లో వైరస్ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో ఇద్దరు భారతీయులకు ఈ మహమ్మారి సోకినట్లు అధికారులు తెలిపారు. ఫలితంగా వైరస్ బారిన పడ్డవారి బారతీయుల సంఖ్య మొత్తం 14కి చేరింది. వారికి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థులు ఇంతమంది ఉన్నారా?