ETV Bharat / bharat

చంద్రయాన్​-2: ఆశలన్నీ ఆర్బిటర్​పైనే..!

చంద్రయాన్‌-2లో రెండు కీలక భాగాలైన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో సంబంధాలు తెగిపోయినా... ఆర్బిటర్‌ సక్రమంగానే పని చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఏడాది పాటు 100x100 కిలోమీటర్ల చంద్రుని కక్ష్యలో పరిభ్రమించనున్న ఆర్బిటర్‌.. 8 పరిశోధనా పరికరాల సాయంతో జాబిల్లిపై అధ్యయనం చేయనుంది. జాబిల్లి పుట్టుకను అర్థం చేసుకోవడంలో దోహదపడే డేటాను అందించనుంది.

author img

By

Published : Sep 7, 2019, 2:27 PM IST

Updated : Sep 29, 2019, 6:36 PM IST

చంద్రుడి కక్షలో ఆర్బిటర్​ సేఫ్​.. ఏడాది పాటు సేవలు
చంద్రుడి కక్ష్యలో ఆర్బిటర్​ సేఫ్​.. ఏడాది పాటు సేవలు

జాబిల్లిపై పరిశోధనల నిమిత్తం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ అనే మూడు కీలక విభాగాల సమ్మేళనం. మెకానికల్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ఈ మూడింటినీ శాస్త్రవేత్తలు అనుసంధానించారు. చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్‌ నుంచి విడిపోయి జాబిల్లిపై మృదువుగా దిగాల్సిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఐతే చంద్రుని కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆర్బిటర్‌ సక్రమంగానే పని చేస్తోంది. చంద్రుని కక్ష్యలో ఆర్బిటర్‌ భద్రంగా ఉందని, దాని పనితీరు సాధారణంగానే ఉందని ఇస్రో అధికారులు వెల్లడించారు.

ఏడాది పాటు సేవలు..

2,379 కిలోల బరువున్న ఆర్బిటర్‌ ఏడాదిపాటు ఇది చంద్రుని కక్ష్యలో తిరుగుతూ పరిశోధనలు చేస్తుంది. సౌర ఫలకాల ద్వారా 1000 వాట్లు విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యం ఆర్బిటర్‌కు ఉంది. భూమి మీదున్న ఇండియన్‌ డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌తో ఇది కమ్యూనికేషన్‌ చేస్తోంది.

తనలోని పరిశోధన పరికరాల సాయంతో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేస్తుంది ఆర్బిటర్​. ఫోటోలు తీసి.. సంబంధిత డేటాను భూమిపైకి చేరవేస్తుంది. చంద్రుడి ఖనిజాల తీరు, అంతర్భాగాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. జాబిల్లి పుట్టుకను అర్థం చేసుకోవడంలో దోహదపడే డేటాను అందిస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే ఎక్స్‌రే ఉద్గారాలను పరిశీలిస్తుంది.

8 పరికరాలు..

ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లు తీసుకెళ్లిన శాస్త్రీయ పరికరాలను పేలోడ్‌లు అంటారు. ఆర్బిటర్‌లో 8 పేలోడ్‌లు ఉండగా అందులో హై క్వాలిటీ కెమెరా, చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం ఉన్నాయి. భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. దానిని కూడా ఈ పరిశోధనా పరికరాలు విశ్లేషిస్తాయి.

చంద్రుడి కక్ష్యలో పరిభ్రమించే ఆర్బిటర్‌ మునుపటి చంద్రయాన్‌-1 తరహాదే. దీని రూపకల్పనలో ఇస్రోకు పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. ఆర్బిటర్‌ క్రాఫ్ట్‌ మాడ్యూల్‌ నిర్మాణాన్ని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ అందించింది. సెంట్రల్‌ కాంపోజిట్‌ సిలిండర్‌, షియర్‌ వెబ్స్‌, డెక్‌ ప్యానళ్లతో దీన్ని రూపొందించింది. ఇది భూకేంద్రంతో కమ్యూనికేషన్లు సాగిస్తుంది.

ఇదీ చూడండి: 'ఇస్రో కోల్పోయింది విక్రమ్​నే... ప్రజల ఆశల్ని కాదు'

AP Video Delivery Log - 0400 GMT News
Saturday, 7 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0359: Bahamas Destruction AP Clients Only 4228707
Destruction at oil storage facility in Bahamas
AP-APTN-0335: At Sea Iran Tanker STILLS News use only; Use within 14 days; No archive or sales; Must credit Maxar Technologies 4228709
Satellite images of Iranian oil tanker off Syria
AP-APTN-0326: India Modi Moon AP Clients Only 4228708
Modi address on loss of contact with moon lander
AP-APTN-0218: Venezuela Maduro Guaido AP Clients Only 4228706
Maduro won't resume talks over Guyana claim
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.