చంద్రుని ఉపరితలంపై నిస్తేజంగా పడి ఉన్న విక్రమ్ ల్యాండర్‌ను ఫోటోలు తీసేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) మంగళవారం ప్రయత్నించనుంది. ఆ చిత్రాలను భారత్‌కు అందజేస్తుంది. ఫలితంగా ల్యాండర్ తాజా స్థితిగతులపై మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
అక్టోబరు 7న భారత్ జాబిల్లిపైకి చంద్రయాన్-2ను పంపింది. దక్షిణ ధ్రువం వద్ద ల్యాండ్ అవుతున్న చివరి నిమిషంలో విక్రమ్ ల్యాండర్ నుంచి భూ కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ వేగంగా ఢీ కొట్టిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) పేర్కొంది.
ఇప్పుడు విక్రమ్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు నాసాతో కిలిసి ప్రయత్నాలు సాగిస్తోంది. విక్రమ్ దిగినట్లుగా భావిస్తున్న ప్రాంతంపైకి నాసాకు చెందిన లూనార్ రికానసెన్స్ ఆర్బిటర్(ఎల్ఆర్వో) మంగళవారం వస్తుంది. ఈ ఉపగ్రహం సాయంతో విక్రమ్ తాజా స్థితిని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎల్ఆర్వో చంద్రునికి చాలా దగ్గరగా పరిభ్రమిస్తోంది.