దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల నుంచి కుళాయి నీటిని సేకరించి ఆగష్టు 15 లోగా నాణత్య పరీక్షలు చేయాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ.. అధికారులను ఆదేశించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇది సాధ్యమేనా? అనే చర్చ సాగుతోంది.
గత ఏడాది కూడా దిల్లీ మినహా.. ఇరవై రాష్ట్రాల రాజధానుల నుంచి కుళాయి నీటి నమూనాలను సేకరించి.. పరిశీలించింది మంత్రిత్వ శాఖ. వీటిలో ఎక్కువ రాష్ట్రాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని గుర్తించినట్లు తెలిపింది.
ఈ నమూనాలకు ఆర్గానోలప్టిక్, రసాయన, విష పదార్థాలు, బ్యాక్టిరియా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఒకటి లేదా రెండు పరామితులు మినహా, అన్ని నాణ్యత పరీక్షల్లోనూ విఫలమైనట్లు వెల్లడించారు.
దీంతో వినియోగదారులకు నాణ్యతతో కూడిన కుళాయి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ..కేంద్ర వినియోగదారుల మంత్రి రామ్ విలాస్ పాసవాన్ లేఖ రాశారు.
ఇదీ చూడండి:రుతుపవనాల రాకపై ఐఎండీతో విభేదించిన స్కైమెట్