లాక్‌డౌన్ అమలులో భాగంగా ఉపాధి కోల్పోయి తమ స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా వలస కూలీలకు వారి సొంత రాష్ట్రాల్లోనే ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా వలస కూలీలు అధికంగా ఉన్న 116 జిల్లాల జాబితాను సిద్ధం చేసి వారికి ఎలాంటి పనులు కల్పించాలనే దానిపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ద్వారా వారికి ఉపాధి కల్పించనున్నారు. జన్ ధన్ యోజన, కిసాన్ కళ్యాణ్ యోజన, ఆహార భద్రతా చట్టం, పీఎం ఆవాస్ యోజన పథకాలను కూడా ఇందుకు ఉపయోగించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం అన్ని మంత్రిత్వశాఖల నుంచి నివేదికలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: సైనిక రహస్యాలను పాక్కు చేరవేస్తున్న ఇద్దరి అరెస్ట్!