ETV Bharat / bharat

'వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి' - three Agricultural acts

వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆ రంగ నిపుణులతో రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​ భేటీ అయ్యారు. వ్యవసాయ విధాన నిపుణులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Centre reaches out to stakeholders on farm bills; Rajnath meets farmers, policy experts
'వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించాలి'
author img

By

Published : Oct 13, 2020, 5:47 PM IST

ఇటీవల కేంద్రం ఆమోదించిన వ్యవసాయ చట్టాలపై రైతుల్లో నెలకొన్న భయాలను తొలగించడానికి ఆ రంగంతో సంబంధం ఉన్న నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలతో భేటి అయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. గ్లోబల్​ ఫూడ్​ అండ్ రిటైల్​ కౌన్సిల్​ ఛైర్మన్​ రాకేశ్​ గంభీర్ సహా పలువురు ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు.

"ఈ మూడు వ్యవసాయ చట్టాలతో.. వ్యవసాయ రంగంలో కొత్త శకం ఆరంభమవుతుంది. రైతులకు దళారీల పీడ వదులుతుంది. రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధర పొందే అవకాశం కలుగుతుంది."

- రాకేశ్​ గంభీర్,

గ్లోబల్​ ఫూడ్​ అండ్ రిటైల్​ కౌన్సిల్​ ఛైర్మన్

వారికి అర్థమయ్యే భాషలోనే...

'నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వారికి వీటిపై అవగాహన కల్పించాలి. రైతులకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అప్పుడే వారిలో ఉండే అపోహలు తొలగిపోతాయి' అని పంజాబ్​కు చెందిన గ్రీన్​ వ్యాలీ ఫార్మ్స్​ ఛైర్మన్ ఆర్​పీఎస్​ గాంధీ పేర్కొన్నారు.​ ఇండియన్ ఛాంబర్​ ఆఫ్​ ఫూడ్​ అండ్​ అగ్రికల్చర్​ ఛైర్మన్​ ఎంజే ఖాన్​ ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు.

ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​తో కలిసి రైతులు, ఇతర ప్రతినిధులతో సమావేశం అయ్యారు రక్షణ మంత్రి.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై కేంద్రానికి సుప్రీం నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.