ETV Bharat / bharat

లాక్​డౌన్ అనేది ఆన్​-ఆఫ్​ స్విచ్​ కాదు: రాహుల్​

కరోనాపై పోరులో కేంద్రం పారదర్శకంగా వ్యవహరించడంలేదని పరోక్ష విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్. ఇకనైనా వైఖరి మార్చుకుని, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వాముల్ని చేయాలని సూచించారు.

author img

By

Published : May 8, 2020, 1:25 PM IST

Rahul Gandhi
లాక్​డౌన్ అనేది ఆన్​-ఆఫ్​ స్విచ్​ కాదు: రాహుల్​

కరోనాపై పోరులో కేంద్రం ఇకనైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రాష్ట్రాలకు సహకరిస్తూ, నిర్ణయాలు తీసుకునే విషయంలో వారిని భాగస్వాములు చేయాలని డిమాండ్​ చేశారు.

వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విలేకరులతో మాట్లాడారు రాహుల్​. లాక్​డౌన్​ అనేది ఆన్​-ఆఫ్​ స్విచ్​ కాదని పేర్కొన్నారు.

" వైరస్​తో పోరాడుతున్నప్పుడు అధికారాన్ని వికేంద్రీకరించటం అవసరం. కేవలం ఈ పోరాటాన్ని ప్రధాని కార్యాలయానికి పరిమితం చేస్తే ఓడిపోతాం. ప్రధాని తప్పనిసరిగా అధికారాన్ని పంచుకోవాలి. ఒకవేళ అధికారాన్ని ఒకరికే పరిమితం చేస్తే.. విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రులను ప్రధాని నమ్మాలి. జిల్లా పాలనాధికారులను ముఖ్యమంత్రులు నమ్మాలి."

– రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

మే 17 తర్వాత లాక్​డౌన్​ కొనసాగింపు లేదా ఎత్తివేతకు ఏ ప్రమాణాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు స్పష్టంచేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాహుల్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.