జాతీయ పౌర జాబితా(ఎన్ఆర్సీ) సిద్ధం చేసేందుకు జులై 31వరకు ఇచ్చిన గడువును పొడిగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాయి కేంద్రం, అసోం ప్రభుత్వం. తుది జాబితా రూపొందించేందుకు మరింత సమయం కావాలని విన్నవించాయి.
శరణార్థులకు భారత్ నిలయం కాకూదని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనానికి తెలిపింది కేంద్రం. స్థానిక అధికారుల జోక్యంతో బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో లక్షల మంది అనర్హులకు ఎన్ఆర్సీలో చోటు కల్పించారని చెప్పింది. జాబితా నమూనాను పరిశీలించాలని కోరింది.
2017 డిసెంబరు 31న అసోం జాతీయ పౌర జాబితా ముసాయిదాను సిద్ధం చేశారు. అత్యున్నత ధర్మాసనం సూచన మేరకు.. 2018 జనవరి 1న 3.29కోట్ల దరఖాస్తులకు గానూ 1.9మందిని ఎన్ఆర్సీ జాబితాలో చేర్చారు.
గత రెండు దశాబ్దాలుగా బంగ్లాదేశ్ నుంచి శరణార్థుల తాకిడి ఎదుర్కొంటోంది అసోం. 1951లో రూపొందించిన జాతీయ పౌరసత్వ జాబితా కల్గిన ఏకైక రాష్ట్రం ఇదే.
ఇదీ చూడండి: కర్ణాటకీయం లైవ్: రాజీనామాకు సిద్ధమైన స్వామి..!