ETV Bharat / bharat

'టీకా వేయడానికి సిబ్బందిని సిద్ధం చేయండి' - covid-19 vaccine

కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చే సమయానికి.. ప్రత్యేక డ్రైవ్​లు​ నిర్వహించి ప్రజలకు టీకా వేయడానికి కావాల్సిన వైద్య సిబ్బందిని సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ.

Centre asks states to identify healthcare workers to carry out COVID-19 inoculation drive
'టీకా వేయడానికి సిబ్బందిని సిద్ధం చేయండి'
author img

By

Published : Nov 30, 2020, 9:03 PM IST

కరోనా టీకా అందుబాటులోకి వచ్చేనాటికి వ్యాక్సిన్​ పంపిణీ, ప్రజలకు టీకాలు వేయడంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది కేంద్రం. ఈ క్రమంలో టీకా వేయడానికి కావాల్సిన వైద్య సిబ్బందిని సిద్ధం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ మేరకు నవంబరు 23న రాష్ట్రాలకు లేఖ రాసినట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వందన గుర్నాని.

టీకాలు, ఇంజక్షన్లు సమర్థంగా వేయడంలో అనుభవం ఉన్న ఎంబీబీఎస్​ వైద్యులు, బీడీఎస్ పట్టభద్రులు, స్టాఫ్​ నర్సులు, సహాయక నర్సులు సహా ఫార్మసిస్టులను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. డిమాండ్​ను బట్టి మాజీ వైద్యులు, నర్సులు, సహా ఫార్మసిస్టుల సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. టీకా వేయడంలో వారికి తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది.

కోటి మందికి పైగా..

ఒకవేళ కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తే ప్రత్యేక డ్రైవ్​లు నిర్వహించి.. టీకా​ ఇవ్వడానికి వైద్యులు, ఎంబీబీఎస్​ విద్యార్థులు, నర్సులు, ఆశా వర్కర్లు సహా సుమారు కోటి మంది వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వీరితోపాటు మరో 3 లక్షల మంది వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు భారతీయ వైద్య సంఘం(ఐఎంఏ) పేర్కొంది.

ఇదీ చూడండి: 'ఆగస్టు నాటికి 30 కోట్ల మందికి టీకా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.