ETV Bharat / bharat

లోక్​సభ ఎన్నికల వ్యయం ఇకపై రూ.77 లక్షలు

ఎన్నికల వ్యయాన్ని సవరించింది కేంద్రం. ఈ మేరకు 25 రాష్ట్రాల్లో లోక్​సభ స్థానాలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు 30 లక్షలు వ్యయంగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

author img

By

Published : Oct 20, 2020, 6:41 AM IST

Updated : Oct 20, 2020, 6:51 AM IST

Elections_Cost limit
ఇకనుంచి లోక్​సభ ఎన్నికల వ్యయం రూ.77 లక్షలు

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని సవరించింది. దేశంలోని 25 రాష్ట్రాల్లో లోక్​సభ స్థానాలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు రూ.30.80 లక్షలను ఎన్నికల వ్యయంగా నిర్ణయిస్తూ, కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అరుణాచల్​ప్రదేశ్, గోవా, సిక్కింలతో పాటు 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో, లోక్​సభ స్థానాలకు రూ. 59.40లక్షలు, అసెంబ్లీ స్థానాలకు (ఉన్నచోట) రూ.22 లక్షలు ఎన్నికల వ్యయంగా నిర్ణయించింది.

దిల్లీలో లోక్​సభ ఎన్నికలకు రూ.77 లక్షలు, అసెంబ్లీ ఎన్నికలకు రూ. 30.80 లక్షలుగా ఖరారు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘంతో సంప్రదించి ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961ను సవరించినట్లు పేర్కొంది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం లోక్​సభకు రూ. 70 లక్షలు, రూ. 54 లక్షలు. అసెంబ్లీ ఎన్నికలకు రూ.28 లక్షలు రూ.20 లక్షల మేరకు ఖర్చు చేయడానికి అనుమతి ఉంది.

ఇదీ చదవండి:'ఆర్థిక వ్యవస్థ నాశనం.. కరోనా కేసులు అధికం'

Last Updated : Oct 20, 2020, 6:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.