దేశ రాజధానిలో వివిధ మంత్రిత్వశాఖలు అద్దె రూపేణా చెల్లిస్తున్న మొత్తాలను ఆదా చేయడంతో పాటు మెరుగైన సమన్వయం కోసమే 'రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు మూడు కి.మీ మేర సెంట్రల్ విస్టా ప్రాజెక్టు'ను తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించే విషయంలో చట్ట నిబంధనల్ని ఉల్లంఘించలేదని తెలిపింది.
సెంట్రల్ విస్టా నిర్మాణంపై పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ ఎం.ఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనానికి కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం వివరాలు నివేదించారు.
ఇదీ చదవండి:తృణమూల్ కాంగ్రెస్ నేతకు చెప్పుదెబ్బలు