ఝార్ఖండ్ లాల్పుర్లోని ఓ షాపింగ్ మాల్లో దుర్ఘటన జరిగింది. తల్లిదండ్రులతో కలిసి మాల్‌కు వచ్చిన 12 ఏళ్ల పార్థివ్ షా ఎస్కలేటర్‌పై నుంచి ప్రమాదవశాత్తు గ్రౌండ్ ఫ్లోర్లో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
రాంచీలోని బ్రిడ్జ్‌ఫోర్డ్ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్న పార్థివ్ షా... కుటుంబంతో కలిసి శనివారం సాయంత్రం లాల్పుర్లోని షాపింగ్ మాల్‌కు వెళ్లాడు. మొదటి అంతస్తులోని ఎస్కలేటర్ పక్కనే ఉన్న ఇనుప రెయిలింగ్‌లపై కాళ్లు వేసి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అతని ఎడమ చేతిని ఎస్కలేటర్ రోలింగ్ బెల్ట్‌పై వేయటం వల్ల అందులో ఇరుక్కుని కిందకు లాగేసింది. అదుపుతప్పి ప్రమాదవశాత్తు పార్థివ్ గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయాడు. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందాడని తెలిసి పార్థివ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
పార్థివ్ షా తల్లి దుర్గా కుమారి రాంచీ కొత్వాలి పోలీస్ స్టేషన్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగంలో పనిచేస్తున్నారు. తండ్రి రాజ్‌కుమార్ భారత నావీకాదళంలో పనిచేసి పదవీవిరమణ పొందారు.
ఇదీ చూడండి: టిక్‌టాక్ గాయం.. తీసింది ప్రాణం