ETV Bharat / bharat

'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్​ఈ చేతిలో లేదు' - సీబీఎస్​ఈ

ఈ నెల 22 నుంచి జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్​ఈ ఏ విధంగానూ సహాయపడకపోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. పై చదువుల కోసం జరిగే అడ్మిషన్ల ప్రక్రియ సీబీఎస్​ఈ చేతిలో ఉండదని పేర్కొంది. పరీక్షల సమయానికి అనేక వర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగుస్తుందన్న పిటిషనర్​ వాదనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

CBSE won't be able to help students taking class XII compartment exams: SC
'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్​ఈ చేతిలో లేదు'
author img

By

Published : Sep 10, 2020, 4:19 PM IST

ఈ నెల 22 నుంచి జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే 12వ తరగతి విద్యార్థులకు సీబీఎస్​ఈ ఏ విధంగానూ సహాయపడకపోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉన్నత విద్య కోసం ప్రవేశాల ప్రక్రియ కళాశాలలు, విశ్వవిద్యాలయాల చేతిలో ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారించిన జస్టిస్​ ఏఎమ్​ ఖన్వి​ల్కర్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

సీబీఎస్​ఈ పరీక్షలు ఈ నెల 22 నుంచి 29 వరకు జరగనున్నాయి. వీటితో పాటు మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న 12వ తరగతి విద్యార్థులకూ పరీక్షలు నిర్వహించనుంది సీబీఎస్​ఈ.

అయితే పరీక్షలు పూర్తయ్యే సరికే అనేక వర్సిటీల్లో అడ్మిషన్లు అయిపోతాయని పిటిషనర్ల తరపున న్యాయవాది వివేక్​ తంఖా సర్వోన్నత న్యాయస్థానికి తెలిపారు. పరీక్షల ఫలితాలు వెలువడకపోవడం వల్ల విద్యార్థులకు ఆయా కళాశాలల్లో ప్రవేశం లభించదని.. వారు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. అందువల్ల ఫలితాలు వెలువడేంత వరకు వర్సిటీలు వేచిచూడాలని.. లేదా అడ్మిషన్లలో వెసులుబాటు కల్పించే విధంగా కళాశాలలను సీబీఎస్​ఈ అభ్యర్థించాలని కోరారు.

దాదాపు 5లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారని.. ఈ సమస్యకు ఓ పరిష్కారాన్ని వెతకాలని వివేక్​ అభ్యర్థించారు. వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం.. దాదాపు 87వేల మంది విద్యార్థులు ఫెయిల్​ అయ్యారని, ఈ సమస్యకు పరిష్కారం సీబీఎస్​ఈ వద్ద ఉండదని అభిప్రాయపడింది.

సమస్య పరిష్కారం కోసం కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు స్టాండింగ్​ కౌన్సిల్​ చేత నోటీసులు అందివ్వాలని సుప్రీంకు అభ్యర్థించారు న్యాయవాది. దాన్ని వ్యతిరేకించిన కోర్టు.. వ్యాజ్యానికి సంబంధించిన కాపీని కేంద్రానికి పిటిషనర్లే ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:- మరాఠా రిజర్వేషన్ అమలుపై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.