ETV Bharat / bharat

టీఆర్​పీ అవకతవకల కేసు సీబీఐకి బదిలీ

యూపీలో టీఆర్​పీ రేటింగ్​లో అవకతవకలకు సంబంధించిన కేసును సీబీఐకి అప్పగించింది యోగి సర్కార్. దీనిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. డబ్బులు తీసుకొని రేటింగ్​ను తారుమారు చేస్తున్నారనేది ప్రధాన అభియోగమని అధికారులు తెలిపారు.

CBI takes over probe into UP-origin complaint of alleged TRP manipulation
టీఆర్​పీ అవకతవకల కేసు సీబీఐకి బదిలీ
author img

By

Published : Oct 20, 2020, 9:18 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో టెలివిజన్ రేటింగ్​ పాయింట్ల(టీఆర్​పీ) అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఓ ప్రచార కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా హజ్రత్​గంజ్ పోలీస్ స్టేషన్​లో ప్రాథమికంగా ఈ కేసు రిజిస్టర్ అయిందని అధికారులు వెల్లడించారు. యూపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసును సీబీఐకి బదిలీ చేసినట్లు చెప్పారు.

తాజాగా ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు అందించిన వివరాల మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డబ్బులు తీసుకొని టీఆర్​పీని తారుమారు చేస్తున్నారనేది ప్రధాన అభియోగమని చెప్పారు. అయితే ఎవరిపై అభియోగాలు మోపారనే విషయాలు వెల్లడించలేదు.

ఇటీవలే ముంబయిలోనూ టీఆర్​పీ కుంభకోణం బయటపడింది. కొందరికి డబ్బులు ముట్టజెప్పి తమ ఇళ్లలోని టీవీలలో ఒకే ఛానెల్​ను చూసేలా ఒప్పందాలు చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ వార్తా సంస్థ రిపబ్లిక్ టీవీ పేరు కూడా ఇందులో వినిపించింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.