ETV Bharat / bharat

'తబ్లీగీ' అక్రమ లావాదేవీలపై సీబీఐ విచారణ! - Tablighi Jamaat

తబ్లీగీ జమాత్ నిర్వాహకులు అక్రమంగా లావాదేవీలు జరుపుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో సీబీఐ ప్రాథమిక విచారణ చేపట్టింది. అందులో భాగంగా తబ్లీగీ జమాత్​ సంస్థకు సంబంధించిన​ రికార్డులను సేకరించడం ప్రారంభించింది. తబ్లీగీ ప్రార్థనలకు హాజరైన వారికి కరోనా సోకడం, వారు సూపర్ స్ప్రెడర్లుగా​ మారి దేశవ్యాప్తంగా వైరస్​ వ్యాపింపజేయడం తెలిసిందే.

CBI starts preliminary enquiry into cash transactions and foreign donations of Tablighi Jamaat
తబ్లీగీ జమాత్ నిర్వహాకులపై సీబీఐ ప్రాథమిక విచారణ
author img

By

Published : May 29, 2020, 4:53 PM IST

Updated : May 29, 2020, 5:02 PM IST

తబ్లీగీ జమాత్​ నిర్వాహకులపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) ప్రాథమిక విచారణ ప్రారంభించింది. అక్రమ మార్గాల్లో నగదు లావాదేవీలు జరుపుతున్నారని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో నిర్వాహకులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అయితే ప్రత్యేకంగా ఏ ఒక్క వ్యక్తి పేరును కూడా సీబీఐ పేర్కొనలేదు.

విదేశీ విరాళాల వివరాలను ప్రభుత్వానికి తెలియజేయడం లేదని తబ్లీగీ నిర్వాహకులపై ఉన్న ప్రధాన ఆరోపణ. విదేశీ విరాళాల (రెగ్యులేషన్​) చట్టం ప్రకారం, ఇతర దేశాల నుంచి సేకరించిన విరాళాల వివరాలను, వాటి ఉద్దేశాన్ని తప్పనిసరిగా ప్రభుత్వానికి తెలియజేయాలి.

సీబీఐ ఇప్పటికే తబ్లీగీ జామాత్ ఆర్థిక లావాదేవీల రికార్డులను ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. ఈ ప్రాథమిక విచారణలో 'ప్రైమా ఫేసీ మెటీరియల్'ను సేకరించి.. తరువాత పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ అధికారులు తెలిపారు.

సమూహ ఉపద్రవం

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అప్పుడప్పుడే మొదలైన సందర్భంలో... తబ్లీగీ జమాత్ ప్రార్థనలు సంచలనం సృష్టించాయి. నిజాముద్దీన్​ ప్రాంతంలో మార్చి నెలలో జరిగిన ఈ తబ్లీగీ ప్రార్థనలకు హాజరైన చాలా మందికి కరోనా సోకింది. ప్రార్థనల తరువాత వారు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఫలితంగా ఇతర ప్రాంతాలకు సైతం కరోనా మహమ్మారి వ్యాపించింది.

ఇదీ చూడండి: లాక్​డౌన్​ 5.0: మరో రెండు వారాలు పొడిగింపు!

Last Updated : May 29, 2020, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.