కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దేశవ్యాప్తంగా మూకుమ్మడి సోదాలు నిర్వహిస్తోంది. 19 రాష్ట్రాల్లోని 110 ప్రదేశాల్లో అవినీతి, ఆయుధాల అక్రమ రవాణా, నేరప్రవర్తనలపై ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఒకేసారి దాడులు చేపట్టింది.
ఇటీవల సీబీఐ 30 కేసులు నమోదు చేసిందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
దిల్లీ, భరత్పూర్, ముంబయి, ఛండీగఢ్, జమ్ము, శ్రీనగర్, పుణె, జైపుర్, గోవా, కాన్పుర్, రాయ్‌పుర్, హైదరాబాద్, మధురై, కోల్‌కతా, రూర్కెలా, రాంచీ, బోకారో, లఖ్‌నవూ సహా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల్లోని పలుచోట్ల దాడులు జరుగుతున్నాయి.
వారం రోజుల వ్యవధిలో సీబీఐ దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. గత మంగళవారం ఇదే తరహాలో బ్యాంకింగ్ మోసాల కేసుల నిందితుల ఇళ్లల్లో దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
ఇదీ చూడండి: పగ్గాలు: అనుభవానికా.. ఉరకలేసే యువతరానికా?