సామాజిక మాధ్యమాల్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఉత్పత్తుల క్రయవిక్రయాల కేసులో సీబీఐ ఇద్దరిని అరెస్టు చేసింది. నిందితులను దిల్లీలోని సాకేత్ కోర్టులో హాజరుపర్చింది. వీరికి జనవరి 22 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం.
పోక్సో, సమాచార సాంకేతిక(ఐటీ) చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఓ అజ్ఞాత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. పోర్న్ విక్రయానికి నిందితుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఉపయోగించుకున్నాడని పేర్కొంది. మరో నిందితుడి నుంచి భారీగా డేటాను సేకరించాడని వెల్లడించింది. ఆ డేటాలో చైల్డ్ పోర్నోగ్రఫీ సహా, పేటీఎం ద్వారా చేసిన చెల్లింపుల వివరాలు ఉన్నాయని తెలిపింది.
ఇదీ చదవండి: చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసిన ఇద్దరి అరెస్టు