ETV Bharat / bharat

మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు- ఏమైంది? - dead cows found in drain

రాజస్థాన్ కోటాలోని ఓ మురికి కాలువలో 25 ఆవుల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. మూగ జీవాలను దారుణంగా చంపి కాలువలో పారేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘాతుకానికి పాల్పడినవారిని కనిపెట్టి అరెస్ట్ చేయాలంటూ.. భజరంగ్ దళ్, విశ్వ హిందు పరిషత్ సంఘాలు నిరసనకు దిగాయి.

Carcasses of over two dozen cattle found in drain in Kota; probe on
25 ఆవులను చంపి మురికి కాలువలో పడేశారు!
author img

By

Published : Sep 7, 2020, 1:10 PM IST

రాజస్థాన్ కోటాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు దాదాపు 25 మూగ జీవాలను చంపి మురికి కాలువలో పారేశారని ప్రాథమిక విచారణలో తేలింది.

25 ఆవులను చంపి మురికి కాలువలో పడేశారు!

కోటా, సరోలా మార్గ్, జాతీయ రహదారి పక్కనున్న సుల్తాన్ పుర్ గ్రామంలో.. మురికి కాలువలో పశువుల కళేబరాలు తేలియాడుతూ కనిపించాయి. రెండు డజన్లకు పైగా ఆవులు, గేదెల మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్, విశ్వ హిందు పరిషత్ సంఘాల కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గోవులను హత్య చేసినవారిని పట్టుకోవాలని నిరసనలు చేపట్టారు.

"24 గంటల్లో పోలీసులు నేరస్థులను పట్టుకోలేకపోతే.. విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ సంయుక్తంగా దేశవ్యాప్త నిరసనకు పిలుపునివ్వాల్సి వస్తుంది."

-ఇందారి మీనా, విశ్వ హిందు పరిషత్ జిల్లా ఇన్ ఛార్జ్

సామూహిక జంతు హత్యలకు పాల్పడినవారిని పట్టుకునేందుకు చర్యలు ముమ్మరం చేస్తామని హామీ ఇచ్చారు స్థానిక తహసీల్దార్ ఆమోద్ మథుర్.

ఇదీ చదవండి: ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్​- ఆయుధ సామగ్రి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.