ETV Bharat / bharat

ముగిసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం - జార్ఖండ్ ఎన్నికల తేదీలు

ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఐదో విడత ఎన్నికలు డిసెంబర్ 20న జరగనుండగా ప్రచారానికున్న గడువు నేటితో ముగిసింది. డిసెంబర్​ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

Campaigning for final phase polling ends in Jharkhand
ముగిసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Dec 18, 2019, 11:42 PM IST

ఝార్ఖండ్ అసెంబ్లీ తుదివిడత ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిదైన ఐదో విడతలో భాగంగా 16 నియోజకవర్గాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓటింగ్​ను సజావుగా నిర్వహించేందుకు 6 జిల్లాల్లో 40,000 భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.

20న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. భద్రత కారణాల దృష్ట్యా బోరియో, బర్​హైత్, లితిపారా, మహేశ్​పుర్, సికారిపారా నియోజకవర్గాల్లో సాయంత్రం 3 గంటలకే పోలింగ్ ముగియనున్నట్లు అధికారులు తెలిపారు.

పోటీలో ప్రముఖులు

ఐదో విడతలో ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. మొత్తం రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగారు సోరెన్​. అయితే డుంకా నియోజకవర్గంలో ఆ రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి, లూయిస్ మరండి(భాజపా) నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. సరథ్​ నుంచి ఆ రాష్ట్ర వ్యవసాయ మంత్రి రాంధిర్ సింగ్ పోటీలో ఉన్నారు.

పోటాపోటీ ప్రచారం

భాజపా తరపున స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అభ్యర్థుల తరపున ప్రచారాలు నిర్వహించారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, ఛత్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, శతృఘ్న సిన్హా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

నక్సల్స్​ ప్రభావిత రాష్ట్రమైన ఝార్ఖండ్​లో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఐదు విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 మధ్య జరిగిన నాలుగు విడతల్లో 65 నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చదవండి: డిసెంబర్ 28న కాంగ్రెస్ దేశవ్యాప్త ర్యాలీలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
US DEPARTMENT OF STATE TV - AP CLIENTS ONLY
Washington, DC - 18 December 2019
1. Secretary of State Mike Pompeo and India's minister of external affairs, Subrahmanyam Jaishankar, enter, shake hands and exit
2. Secretary of State Pompeo, Defense Secretary Mark Esper and U.S. delegation sitting opposite India's delegation, including Jaishankar and India's defense chief, Rajnath Singh
STORYLINE:
US Secretary of State Mike Pompeo welcomed India's minister of external affairs, Subrahmanyam Jaishankar, to the State Department on Wednesday.
Pompeo and U.S. Defense Secretary Mark Esper also held bilateral talks with Jaishankar and India's defense chief, Rajanth Singh, and other officials at the State Department.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.