ETV Bharat / bharat

కుమారుడి అంత్యక్రియల్లోనూ బాధ్యత మరువని 'యోధుడు'

author img

By

Published : May 6, 2020, 5:26 PM IST

గుండె పగిలేంత బాధలోనూ బాధ్యత మరువలేదు ఆ 'కరోనా యోధుడు'. కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా భౌతిక దూరం నిబంధనలు పాటించాడు. కన్నబిడ్డ మృతదేహానికి ఇతరులు అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... దూరం నుంచి అలా చూస్తూ ఉండిపోయాడు.

corona warrior
కుమారుడి అంత్యక్రియల్లోనూ బాధ్యత మరువని 'యోధుడు'

వైరస్ మానవాళిని అతలాకుతలం చేస్తున్న వేళ.. ఓ కరోనా యోధుడి కన్నీటి గాథ హృదయం ద్రవించేలా ఉంది. రోజంతా పనిచేసి ఇంటికి వెళితే తన చిరునవ్వుతోనే అలసట మాయం చేసే.. మూడేళ్ల కుమారుడి కడసారి స్పర్శకు నోచుకోలేకపోయాడు ఆ తండ్రి. గుండెలో బాధ దిగమింగుకుంటూనే.. గంభీర వదనంతో అంత్యక్రియల వద్ద కూడా భౌతిక దూరాన్ని పాటించాడు. కళ్లు చెమర్చే ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఇదీ జరిగింది..

లఖ్​నవూ లోక్​బంధు ఆస్పత్రిలో వార్డ్​బాయ్​గా సేవలు అందిస్తున్నాడు మనీశ్​కుమార్. శనివారం రాత్రి కరోనా ఐసొలేషన్ వార్డులో విధుల్లో ఉన్నాడు. అప్పుడే అతనికి ఓ ఫోన్​కాల్ వచ్చింది. కుమారుడు హర్షిత్​ శ్వాస తీసుకోలేకపోతున్నాడని, కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు సమాచారం అందింది. అనంతరం అది విషాద వార్తగా మారింది.

"నేను ఆ కాల్ అందుకునే సమయంలో పూర్తిగా అలసిపోయి ఉన్నాను. అయితే వెంటనే ఆస్పత్రిని విడిచిపెట్టి వెళ్లలేకపోయాను. మా కుటుంబసభ్యులు నా కుమారుడిని వేరొక ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లాడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడో ఫొటోలు తీసి పంపించడం ప్రారంభించారు. రెండు గంటల సమయంలో చిన్నారి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. పిల్లాడిని చూడాలని ఆశగా ఉంది. అదే సమయంలో వైరస్ బాధితులను వదలి వెళ్లాలని అనిపించలేదు. అయితే వెంట వెంటనే ఫోన్లు రావడం.. నా ముఖంలో వేదన చూసి ఏదో జరిగి ఉంటుందని గుర్తించి.. ఇంటికి వెళ్లాలని ఒత్తిడి చేశారు నా సహచరులు."

-మనీశ్, చిన్నారి తండ్రి

వైరస్ వార్డులో సేవలు అందిస్తున్న కారణంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని.. పిల్లాడు చనిపోయిన ఆస్పత్రికి వెళ్లాడు మనీశ్. అయితే తనకు వైరస్ ఉంటే లోపలకు వెళ్లడం ప్రమాదకరమని భావించి బయటే ఉండిపోయాడు. దూరం నుంచి పిల్లాడిని చూశాడు. ముందు వాహనంలో చిన్నారి మృతదేహం, కుటుంబం వెళ్తుంటే.. వెనుక బైక్​పై అనుసరించాడు మనీశ్. కుమారుడిని కౌగిలించుకోవాలని మనస్సు లాగుతున్నా.. మిగతా వారికి వైరస్ సోకుతుందనే కారణంగా.. ఆ ఆలోచనను విరమించుకున్నట్టు చెప్పాడు. ఇతర కుటుంబ సభ్యులు పిల్లాడికి అంత్యక్రియలు నిర్వహిస్తుంటే... అలా దూరం నుంచే చూస్తూ ఉండిపోయాడు.

ఓదార్పూలోనూ.. 'భౌతికమే'

ప్రస్తుతం తన కుమారుడి వీడియోలను ఫోన్లో చూస్తూ కాలం గడుపుతున్నట్లు చెప్పాడు మనీశ్. భార్యను ఓదారుస్తున్నట్లు వెల్లడించాడు. అయితే ఇందులోనూ భౌతిక దూరం పాటిస్తున్నట్లు చెప్పాడు. మరో రెండు రోజుల్లో విధులకు హాజరవుతానని.. వైరస్ బాధితులకు సేవలు అందిస్తానని చెప్పాడు.​

ఇదీ చూడండి: 'ఫార్మసీల్లో ఆ మందులు తప్పక ఉండేలా చూడండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.