ETV Bharat / bharat

'అంబేడ్కర్​ దూరదృష్టి వల్లే కాగ్​ ఏర్పాటు'

భారతరత్న డా. బీఆర్​ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే కాగ్ వంటి స్వయం ప్రతిపత్తి సంస్థలు ఏర్పాటయ్యాయని తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దిల్లీలోని కాగ్​ కార్యాలయంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

CAG is an enabler of Balasaheb's vision: Naidu
'అంబేడ్కర్​ దూరదృష్టి కారణంగానే కాగ్​ ఏర్పాటు'
author img

By

Published : Jul 22, 2020, 4:35 PM IST

భారత దేశాభివృద్ధికి అవినీతి ఓ అవరోధంగా మారిందని.. దీన్ని పారదోలేందుకు ప్రభుత్వంతోపాటు పౌరసమాజం, ప్రజలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. దిల్లీలోని కంప్ట్రోలర్ అండ్​ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్​) ప్రధాన కార్యాలయం ఆవరణలో భారత​రత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్​‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేడ్కర్​ సేవలను కొనియాడారు.

'రాజనీతిజ్ఞతతో పాటు సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా, మేధావిగా, న్యాయకోవిదుడిగా, ఆర్థికవేత్తగా, రచయితగా, మానవతా మూర్తిగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన గొప్ప వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. ప్రపంచంలోనే దృఢమైన రాజ్యాంగం కలిగుండటం భారతదేశ ప్రత్యేకత. దీని రూపకల్పనతోపాటు క్లిష్టమైన సమయంలో బాబాసాహెబ్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అత్యంత కీలకం. భారత రాజ్యాంగం నేటికీ దేశానికి ఓ మార్గదర్శిగా దారి చూపిస్తోంది. అలాంటి రాజ్యాంగ పవిత్రతను కాపాడటంలో ప్రతి భారతీయుడు చిత్తశుద్ధితో పనిచేయాలి. బడుగు, బలహీన, అణగారిన వర్గాల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న డాక్టర్ అంబేడ్కర్.. తన జీవితంలో చివరి క్షణం వరకు సామాజిక అసమానత, కుల, లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళా సాధికారతకోసం కృషిచేశారన్నారు. అలాంటి మహనీయుల జీవితాన్ని, వారు చూపిన ఆదర్శాలను గుర్తుచేసుకుని.. వాటినుంచి మనతోపాటు భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందడమే.. వీరి విగ్రహాలను ఏర్పాటుచేయడం వెనక ఉద్దేశం'

-వెంకయ్య నాయుడు, ఉప రాష్ట్రపతి​.

అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఆయన గుర్తుచేశారు. జవాబుదారీతనం, పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలన్న ఉపరాష్ట్రపతి.. స్వతంత్రత, నిష్పాక్షికత, సమగ్రత, విశ్వసనీయత, శ్రేష్ఠత, పారదర్శకత, సానుకూల దృక్పథం మొదలైన కాగ్ మూలవిలువలకు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీవితమే ప్రేరణ అన్నారు.

CAG is an enabler of Balasaheb's vision: Naidu
'అంబేడ్కర్​ దూరదృష్టి కారణంగానే కాగ్​ ఏర్పాటు'

2022 నాటికి కార్యకలాపాలన్నీ కాగితరహితంగా నిర్వహించాలన్న కాగ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు వెంకయ్య.

ఇదీ చూడండి: రాజ్యసభలో కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.