ETV Bharat / bharat

అన్​లాక్ 2.0 అమలు తీరుపై కేంద్రం సమీక్ష - 'Unlock 2

దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్​లాక్ 2.0 అమలు తీరుపై సమీక్షించింది కేంద్రం. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నత అధికారులతో మాట్లాడారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా. ఆయా అంశాలపై చర్చించారు.

unlock 1.0
అన్​లాక్ 2.0 అమలుపై కేంద్రం సమీక్ష
author img

By

Published : Jul 5, 2020, 9:51 AM IST

దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రెండో విడత లాక్​డౌన్ సడలింపుల అమలు తీరును కేంద్ర ప్రభుత్వం సమీక్షించింది. 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఉన్నతస్థాయి అధికారులతో శనివారం.. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా మాట్లాడారు. రెండో విడత సడలింపుల్లో భాగంగా దశల వారీగా పునరుద్ధరించేందుకు అవకాశం ఉన్న అంశాలపై చర్చించారు. కరోనా కట్టడికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని అధికారులందరూ అభిప్రాయపడినట్లు తెలిసింది.

అనుమతించిన ఆర్థిక కార్యకలాపాలకు అవరోధాలు కలిగించరాదని, తద్వారా సాధారణ జీవనం సాఫీగా కొనసాగనివ్వాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్రాలకు స్పష్టం చేశారు. అత్యవసర కార్యకలాపాలకు మినహా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా ఉంటుంది. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామ కేంద్రాలు, ఈత కొలనులు, పార్కుల మూసివేత కొనసాగించనున్నారు.

ఇదీ చూడండి: వ్యవస్థీకృత జాడ్యాల వికృతరూపం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.