దిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసే తీర్మానాన్ని ఆమోదించింది మంత్రివర్గం. అనంతరం రాష్ట్రపతికి ఈ ప్రతిని అందించనున్నారు. నూతనంగా ఎన్నికైన ఎంపీలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఎంపీలను శనివారం దిల్లీ రావాలని ఆదేశించింది భాజపా. ఆ మరునాడే పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయనుంది. అదే రోజు లోక్సభాపక్షనేతను ఎన్నుకోనున్నారు నూతన ఎంపీలు.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం