పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈనెల 29న ప్రారంభమయ్యే అవకాశముంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ(సీసీపీఏ).. ఈ మేరకు సిఫార్సు చేసినట్టు సమాచారం. తొలి దశలో జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు, మలి దశలో మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు సభ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.
సీసీపీఏ సిఫార్సుల ప్రకారం.. ఈనెల 29న రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం సార్వత్రిక పద్దును ప్రవేశపెడుతుంది.
గతంలో జరిగిన వర్షాకాల సమావేశాలు మాదిరిగానే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా బడ్జెట్ సెసన్స్ నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.