పాఠశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసి రాష్ట్రాలకు తోడ్పాటును అందించేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగంగా స్ట్రెన్త్నింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎన్ఈపీ అమలుకు కేంద్రం ఓకే చెప్పిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. స్టార్స్ పథకానికి ప్రపంచబ్యాంకు నుంచి 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ స్కీమ్‌కు రూ.5వేల 718 కోట్లు వెచ్చించేందుకు కేంద్రం అంగీకరించింది.
జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. దీన్‌దయాల్ అంత్యోదయ యోజన కింద రూ. 520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వనుంది.
ఇదీ చూడండి:- భారత నూతన విద్యా విధానంపై 10 దేశాల ఆసక్తి!