ETV Bharat / bharat

మోదీ మాటతో ఆ శునకాలకు పెరిగిన క్రేజ్​ - ప్రధాని మోదీ మెచ్చిన శునకాలు

విదేశీ జాతి శునకాలను వీడి.. స్వదేశంలోని కుక్కలను పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ముధోల జాతి శునకాలకు విపరీతంగా డిమాండ్​ పెరిగిపోయింది. ఒక్కో కుక్క ధర గతంలో రూ.9వేలుగా ఉంటే.. ఇప్పుడది రూ. 18వేలు పలుకుతోంది. మరి ఈ 'మోదీ మెచ్చిన శునకాల' ఎలా ఉంటాయి? వీటి ప్రత్యకతలేంటి?

మోదీ చెప్పారు... స్వదేశీ శునకాలను కొనేస్తున్నారు
author img

By

Published : Sep 13, 2020, 1:24 PM IST

మోదీ మాటతో.. స్వదేశీ శునకాలకు పెరిగిన క్రేజ్​

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడమే ఆలస్యం... అనేక మంది దేశప్రజలు వాటిని ఆచరించడం మొదలుపెట్టేస్తారు. తాజాగా.. ఇదే విషయం మరోమారు రుజువైంది. గత 'మన్​కీ బాత్'​లో విదేశీ శునకాలను వీడి.. స్వదేశీ కుక్కలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అంతే.. ఇప్పుడా ట్రెండ్​ మొదలైపోయింది. ఫలితంగా కర్ణాటకలో ఉండే ముధోల జాతి శునకాలకు డిమాండ్​ అమాంతం పెరిగిపోయింది. దీంతో వాటి ధరలు కూడా ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. సాధారణంగా ఆడ ముధోల శునకం ధర రూ. 9వేలు, మగ కుక్క ధర రూ. 10వేలుగా ఉండేది. కానీ మోదీ మనసులో మాట అనంతరం.. వాటి ధరలు వరుసగా రూ. 18వేలు, రూ. 20వేలకు పెరిగాయి.

ఈ ముధోల జాతి శునకాలను వేట కుక్కలని కూడా పిలుస్తారు. ఒక్కసారి వేట కోసం బరిలో దిగితే.. ఇవి వేటినీ విడిచిపెట్టవు. వీటి దేహం ప్రత్యేకంగా ఉంటుంది. పొడవాటి కాళ్లు, ముఖంతో ఉండే వీటి ఆకారం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

మోదీ మెచ్చిన శునకాలు...

ఈ ముధోల కుక్కలు మహారాజా మలోజిరావ్​ కాలంలో తొలిసారిగా కనపడ్డాయి. అనంతరం ఇవి శివాజీ మహారాజు సైన్యంలో ఉండేవి. ఇవి శత్రువులతో పోరాడినట్టు కూడా కథలు ఉన్నాయి.

ఇప్పుడు ఇవి 'మోదీ మెచ్చిన శునకాలు'గా గుర్తింపు పొందుతున్నాయి. ప్రస్తుతం వీటిని భారత సైన్యం, సీఆర్​పీఎఫ్​ జవాన్లు వినియోగిస్తున్నారు.

ఈ జాతి శునకాలకు చెందిన సంతానోత్పత్తి కేంద్రం కర్ణాటక తిమ్మాపురంలో ఉంది. ఇందులో మొత్తం 40 కుక్కలున్నాయి. వీటికి ఇప్పుడు విపరీతంగా క్రేజ్​ వచ్చింది. త్వరలోనే వీటిని కర్ణాటక పోలీసుశాఖలో చేర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఇదీ చూడండి- ప్రపంచానికి బొమ్మల హబ్​గా భారత్​: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.