కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2019-20 పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటితో పాటు అనేక సవాళ్ల మధ్య ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ముఖ్యమైన అంశాలు సంక్షిప్తంగా..
- 2014లో 1.85 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను.. ఏన్డీఏ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 2.5 ట్రిలియన్ డాలర్లకు చేర్చినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. వచ్చే ఐదేళ్లలో 5ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- దేశంలో ప్రస్తుతం 657 కిలో మీటర్ల మేర మెట్రో రైలు మార్గం ఉంది. మరో 300 కిలోమీటర్లకు అనుమతులు మంజూరయ్యాయని వెల్లడి.
- వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పుల్లేవు. రూ.5 లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. పెట్టుబడుల సేకరణపై ఎలాంటి ఆదాయ పన్ను పరిశీలన ఉండదు.
- సూక్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. కోటి వరకు రుణ సదుపాయం.
- రూ.1.5 కోట్ల లోపు ఆదాయం ఉన్న చిల్లర వర్తకులకు...'కర్మ యోగి మాన్‌ధన్ యోజన' పేరుతో పింఛను పథకం. దేశ వ్యాప్తంగా 3 కోట్ల దుకాణదార్లకు లబ్ధి చేకూరేలా పథకం రూపకల్పన.
- ఏడాదికి రూ. కోటికి మించి బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ చేసుకుంటే... 2 శాతం టీడీఎస్ వర్తింపు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం కోసం ఎండీఆర్(మర్చండైజ్ డిస్కౌంట్ రేట్) పూర్తిగా రద్దు.
- పెట్రోల్, డీజిల్ పై ఒక రూపాయి ఎక్సయిజ్ సుంకం పెంపు. బంగారంపై కస్టమ్స్ సుంకం 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంపు.
- మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన పెట్టుబడుల ఉపసంహరణ రూ. 90,000 కోట్ల నుంచి రూ. 1,05,000 కోట్లకు పెంపు.
- రూ. 45లక్షల లోపు గృహ రుణాలపై ప్రస్తుతం రూ. 2 లక్షలుగా ఉన్న వడ్డీ రాయితీ.. రూ.3.5 లక్షలకు పెంపు. విద్యుత్ వాహనాలపై రూ. 1.5 లక్షల వడ్డీ రాయితీ.
- కొత్తగా రూ.1, రూ.2, రూ.5, రూ.10 నాణేలు... చూపులేని వారు కూడా గుర్తించే విధంగా ముద్రణ... త్వరలో అందుబాటులోకి.
- మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ పథకం దేశవ్యాప్తంగా వర్తింపు. ముద్రా యోజన ద్వారా సంఘాల్లో ఉన్న ప్రతి మహిళకు రూ. లక్ష వరకు రుణం.
- 'భారత్ నెట్' పథకంతో గ్రామీణ ప్రాంతాలకు అంతర్జాల సదుపాయాలను వేంగంగా విస్తరించే పనులు. గ్రామాలకు పట్టణాలకు మధ్య సాంకేతిక అంతరాలను తొలగించడమే ముఖ్య ఉద్దేశం.
- బ్యాంకులకు రుణాల కేటాయింపునకు మూలధన సహాయం కింద రూ.70,000 కోట్లు కేటాయింపు. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను మొండిబాకీల నుంచి గట్టెక్కించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడి.
- రూ. 400 కోట్లతో నూతన జాతీయ విద్యా విధానం. భారత్‌ను విద్యా హబ్‌గా మార్చి విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు 'స్టడీ ఇన్ ఇండియా' కార్యక్రమానికి శ్రీకారం.
ఇదీ చూడండి: పద్దు 2019: నవభారత నిర్మాణం- సుస్థిర ప్రగతి