బంగాల్లో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్ మృతిచెందారు. మరో సైనికుడు గాయపడ్డారు. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) దళాలు ఈ కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.
ముర్షిదాబాద్ జిల్లాలో సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ బృందం గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధమైన చర్యలను ఆపడానికి ప్రయత్నించినప్పుడే ఈ ఘటన జరిగి ఉంటుందని వారు చెప్పారు.
ఫ్లాగ్ మీటింగ్
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ భద్రతాదళ అధికారులతో బీఎస్ఎఫ్ ఫ్లాగ్ మీటింగ్‌ను ఏర్పాటుచేసింది.
బీఎస్ఎఫ్-బీజీబీల మధ్య దశాబ్దాలుగా చాలా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. రెండు దళాల మధ్య గతంలో ఎన్నడూ ఇలా కాల్పులు జరగలేదు.
ఇదీ చూడండి: 'ఇది కార్యశక్తి.. స్వార్థశక్తికి మధ్య జరిగే పోరు'