ఓ మనిషి చనిపోయాక అవయవదానం చేయడమే గొప్ప విషయం. మరి ప్రాణాలతో ఉండగానే, జీవం ఉన్న గుండెను మరొకరికి దానం చేయడమంటే? అంతకన్నా మహోన్నతమైనది ఏదైనా ఉంటుందా? ఒడిశాకు చెందిన బిపిన్ రఘు ప్రాణమున్న గుండె మాత్రమే కాదు, రెండు కళ్లు, లివర్, కిడ్నీలనూ తృణప్రాయంగా దానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటాడు.
ఒడిశాకు చెందిన బిపిన్ పొట్టకూటి కోసం కుటుంబంతోపాటు గుజరాత్ సూరత్‌కు వచ్చి భేస్తాన్ విస్తార్లో స్థిరపడ్డాడు. 49 ఏళ్ల బిపిన్ ఈ నెల 9వ తేదీన ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళితే.. సీటీ స్కాన్ చేసి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. ఇలా బ్రెయిన్‌డెడ్ అయినవారు తిరిగి కోలుకునే అవకాశం దాదాపు ఉండదని చెప్పేశారు.
వెలకట్టలేని త్యాగం...
ముందు గుండెలు పగిలేలా రోధించిన బిపిన్ భార్య, కుమార్తె, కుమారులు.. వైద్యుల సూచన మేరకు మరో ఐదుగురికి ప్రాణం పోసేందుకు సిద్ధపడ్డారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి బిపిన్ అవయవాలను దానం చేసేందుకు మనఃస్ఫూర్తిగా అంగీకరించారు. బిపిన్, కుటుంబసభ్యుల త్యాగానికి ఆసుపత్రిలోని వైద్యులు సైతం సలాం చేశారు.
డొనేట్ లైఫ్ సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా బిపిన్ గుండెను శరీరం నుంచి వేరు చేశారు కిరన్ ఆసుపత్రి వైద్యులు. గ్రీన్ కారిడార్ సాయంతో గుండెను అహ్మదాబాద్‌కు తరలించారు.
ఇదీ చదవండి:'జాతకం చూసి మేము 350 సీట్లు గెలుస్తామని చెప్పాడు'