'సరిహద్దుల్లో దేశ భద్రతకు కఠిన సవాలు' - భారత్ చైనా సరిహద్దు వివాదం
చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు రాజకీయంగా పెనుప్రభావాన్ని చూపాయని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భారీగా బలగాలను మోహరించడం వల్ల దేశ భద్రతకు క్లిష్టమైన సవాలుగా మారిందన్నారు.
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి.. ఆయుధాలతో చైనా బలగాలు భారీ స్థాయిలో మోహరించడం దేశ భద్రతకు క్లిష్టమైన సవాల్‌గా మారిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. జూన్‌లో లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలు.. రాజకీయంగా పెనుప్రభావాన్ని చూపాయన్న జైశంకర్.. ఘర్షణల అనంతరం భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలిపారు.
ఆసియా సొసైటీ ఆధ్వర్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న విదేశాంగమంత్రి.. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, సుస్థిరతల కోసమే.. 30ఏళ్లుగా చైనాతో భారత్ సత్సంబంధాలు కొనసాగించిందన్నారు. ఇందుకోసం 1993 నుంచి అనేక ఒప్పందాలు చేసుకున్నట్లు వివరించారు. అయితే వీటన్నింటిని కాదని సరిహద్దుల్లో చైనా భారీస్థాయిలో సైనికులను మోహరించడం వల్ల ఈ ఏడాది పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయన్నారు.
ఇదీ చూడండి:- 'చైనాతో చర్చలపై ఇప్పుడే ఏం చెప్పలేం'