కరోనా వేళ ఆన్లైన్లోనే అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఇంటర్ పాసైనవారు డిగ్రీ కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నారు. అలా వచ్చిన అప్లికేషన్లను కోల్కతాలోని అశుతోష్ డిగ్రీ కాలేజీ ఇంటర్ ప్రతిభ ఆధారంగా ఒక వరుస క్రమంలో పెట్టింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం తొలి జాబితాను తమ వెబ్సైట్లో విడుదల చేసింది. అయితే... ఆ జాబితా తొలి వరుసలో బాలీవుడ్ నటి 'సన్నీ లియోనీ' పేరు చూసి విద్యార్థులతో పాటు, కళాశాల యాజమాన్యం ఖంగుతింది.
![Bollywood actor sunny leone's name in the top of admission merit list of kolkata college.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8588041_1075_8588041_1598599347487.png)
నలభై ఏళ్ల వయసులో సన్నీ ఇంటర్ పాస్ అవ్వడం, అది కూడా 400/400 మార్కులు సాధించడమేంటని సందేహం వచ్చింది యాజమాన్యానికి. సన్నీ పేరిట బీఏ(ఆంగ్లం)లో సీటు కోసం దరఖాస్తు చేసిందెవరనే కోణంలో విచారణ చేపట్టింది.
" ఇదెవరో కావాలని చేసిన పనే. సన్నీ లియోనీ పేరిట ఎవరో తప్పుడు దరఖాస్తు పంపించారు. ప్రస్తుతం ఆ పేరు జాబితా నుంచి తొలగించాల్సిందిగా ప్రవేశాల విభాగానికి సూచించాం. ఈ ఘటనపై విచారణ చేపడతాం."
-అశుతోష్ కళాశాల యాజమాన్యం
ఇదీ చదవండి: పరీక్షల నిర్వహణపై యూజీసీని సమర్థించిన సుప్రీం