మహారాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు ముప్పు ఏర్పడుతోంది. రత్నగిరి జిల్లా తివారే గ్రామంలోని డ్యామ్‌కు అర్ధరాత్రి గండి పడటం వల్ల 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గల్లంతయ్యారు. డ్యామ్ నుంచి ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహించిన వరదకు 12 నుంచి 15 ఇళ్లు కొట్టుకుపోయాయి. 11 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు మిగతావారి కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు.
నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.