ETV Bharat / bharat

'భాజపా పనితీరు ఓర్వలేకే చట్టాలపై అసత్యాలు'

author img

By

Published : Dec 14, 2020, 8:24 PM IST

ఇటీవలి ఎన్నికల్లో భాజపా కనబరిచిన అద్భుత పనితీరును జీర్ణించుకోలేకే.. సాగు చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విపక్షాలపై మండిపడ్డారు ఆ పార్టీ జాతీయ ప్రతినిధి సంబిత్​ పాత్ర. బిల్లులకు నోటిఫికేషన్​ ఇచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో భాజపా గెలిచిందని, రైతులు, పేదలు తమ పార్టీతోనే ఉన్నారని స్పష్టం చేశారు. రైతుల సమస్యలపై రాహుల్​ గాంధీకి ఎంతమాత్రం తెలుసని ప్రశ్నించారు.

Sambith pathra
భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్​, ఆప్​లపై విమర్శలు గుప్పించారు భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్​ పాత్ర. దేశంలోని ప్రతి రాష్ట్రంలో భాజపా అద్భుత పనితీరు కనబురుస్తోందని, అది చూసి ఓర్వలేకనే ఈ విధంగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అసోం బీటీసీ, కశ్మీర్​ డీడీసీ, గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల్లో భాజపా అద్భుత పనితీరు కనబరిచింది. భాజపా విజయాల్ని జీర్ణించుకోలేకే.. ప్రతిపక్షాలు సాగు చట్టాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. మూడు సాగు చట్టాల బిల్లులకు నోటిఫికేషన్​ ఇచ్చినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో భాజపా గెలిచింది. పేదలు, రైతులు, ఇతరులకు పీఎం మోదీ నిజమైన సానుభూతిపరుడు. పేదలు, గ్రామాలు, రైతులు దేశానికి వెన్నెముక. రైతులు, పేదలు, కార్మికులు మాతో ఉండబట్టే వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది."

- సంబిత్​ పాత్ర, భాజపా జాతీయ ప్రతినిధి.

ప్రధాని మోదీ రైతులకు కొత్త తరం స్వేచ్ఛను ఇచ్చారని పేర్కొన్నారు సంబిత్​ పాత్ర. రైతుల ఆందోళనలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారో అందరికి తెలుసునన్నారు. రాహుల్​ గాంధీ, ఇతర విపక్ష నేతలు కరోనా వైరస్​ వ్యాప్తి గురించి గందరగోళం సృష్టించారని ఆరోపించారు. అలాగే.. వలస కార్మికులు, సాగు చట్టాలపై అసత్యాలు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. రైతుల సమస్యలపై రాహుల్​ గాంధీకి ఎంతమాత్రం తెలుసని ప్రశ్నించారు.

ఎంఎస్​పీ కొనసాగుతుంది..

దేశంలోని చాలా మంది రైతులు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలకు అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పరషోత్తం రుపాలా. కనీస మద్దతు ధర (ఎంఎస్​పీ)ని చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఎంఎస్​పీ అమలులోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఆందోళనలు చేపడుతున్న రైతులు చర్చలకు రావాలని కోరారు.

ఇదీ చూడండి: 'సాగు చట్టాల వల్ల తీవ్ర స్థాయికి ద్రవ్యోల్బణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.