ETV Bharat / bharat

'రాసిపెట్టుకోండి'... బంగాల్​పై ప్రశాంత్ జోస్యం

బంగాల్​లో భాజపా ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించదని జోస్యం చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఈ వ్యాఖ్యల్ని భాజపా తోసిపుచ్చింది. తమ గెలుపు తథ్యమని పునరుద్ఘాటించింది.

BJP will struggle to CROSS DOUBLE DIGITS in West Bengal, says prasanth kishore
రాసిపెట్టుకోండి... బంగాల్​పై పీకే జోస్యం!
author img

By

Published : Dec 21, 2020, 11:45 AM IST

Updated : Dec 21, 2020, 1:55 PM IST

బంగాల్​ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు 99 కన్నా ఎక్కువ స్థానాలు రావడం గగనమని జోస్యం చెప్పారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. 294 నియోజకవర్గాలున్న బంగాల్​లో 200కుపైగా స్థానాలు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ధీమా వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈమేరకు ట్వీట్ చేశారు.

BJP will struggle to CROSS DOUBLE DIGITS in West Bengal, says prasanth kishore
ప్రశాంత్​ కిషోర్​ ట్వీట్​

"అనుకూల మీడియాలో ఎంతలా ప్రచారం చేసుకున్నా... వాస్తవంలో భాజపా రెండంకెలు దాటేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఈ ట్వీట్​ సేవ్ చేసి పెట్టుకోండి. నేను చెప్పినదానికన్నా భాజపా మెరుగైన పనితీరు కనబరిస్తే... నేను ట్విట్టర్​ నుంచి తప్పుకుంటా," అని ట్వీట్ చేశారు ప్రశాంత్.

ప్రస్తుతం బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​కు రాజకీయ సలహాదారుగా పనిచేస్తున్నారు ప్రశాంత్.

'భాజపాదే అధికారం..'

ప్రశాంత్​ కిషోర్​ వ్యాఖ్యలపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్​ విజయ్​వర్గీయ విరుచుకుపడ్డారు. బంగాల్​లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం.. దేశం ప్రశాంత్​ కిశోర్​ వంటి ఎన్నికల వ్యూహకర్తను కోల్పోతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"బంగాల్​లో భాజపా సునామీ కొనసాగుతోంది. మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం, ఓ రాజకీయ వ్యూహకర్తను దేశం కోల్పోతుంది."

-- విజయ్​వర్గీయ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి.

2021 మే నెలలో బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీఎంసీ, ఎలాగైనా బంగాల్​ను దక్కించుకోవాలని భాజపా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇప్పటికే తారస్థాయికి చేరింది.

ఇవీ చూడండి:-

Last Updated : Dec 21, 2020, 1:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.