ETV Bharat / bharat

మరాఠా ఎన్నికలపై భాజపా కసరత్తు షురూ

ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికలపై భాజపా కసరత్తు ప్రారంభించింది. 288 స్థానాలు గల శాసనసభలో 220 సీట్లకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఎన్నికల్లోనూ విజయం తమదేనని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 22, 2019, 7:15 AM IST

మరాఠా ఎన్నికలపై భాజపా కసరత్తు షురూ

2019 చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భాజపా కూటమి సన్నహాలు ప్రారంభించింది. 288 స్థానాలున్న శాసనసభలో 220 పైన సీట్లను గెలవాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ఎన్నికల వ్యూహంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో ముంబయి వేదికగా భాజపా నేతలు సమావేశమయ్యారు. తాను రెండోసారి ముఖ్యమంత్రి పదవిని చేపడతానని విశ్వాసం వ్యక్తం చేశారు ఫడణవీస్​. శివసేన పార్టీ ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఫడణవీస్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

"నూతన ముఖ్యమంత్రిని ప్రజలే నిర్ణయిస్తారు. మనం చేసిన అభివృద్ధే మాట్లాడుతుంది. నేను ఇంతకుముందే శాసనసభలో తిరిగి ఎన్నికవుతానని ప్రకటించాను."

-దేవేంద్ర ఫడణవీస్

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు కొనసాగుతాయని, త్వరలో సీట్ల అంశమై కూటమి పార్టీలతో చర్చిస్తామని తెలిపారు ఫడణవీస్.

అబ్​కీ బార్...నినాదంతో

సీనియర్ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ మునిగంటివార్​ ఎన్నికల నినాదాన్ని విడుదల చేశారు. 'అబ్​కీ బార్...220 పార్' అని నినదించి 220 సీట్లు గెలవడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. కుంభకోణాలతో కూడిన కాంగ్రెస్ వల్ల దేశానికి తీవ్ర నష్టమని ఆరోపించారు మునుగంటివార్. ఇటీవల ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గంలో ఒక అధ్యక్షుడు, ఐదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించడం వారి డొల్లతనానికి నిదర్శనమన్నారు.

288 నియోజకవర్గాల్లో మిత్ర పక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించినప్పటికీ బూత్​ స్థాయి పోల్ మేనేజిమెంట్ ప్రక్రియను సమర్థంగా చేపట్టాలని ఆకాంక్షించారు రెవెన్యూ మంత్రి చంద్రకాంత్ పాటిల్.

2014 ఎన్నికల్లో భాజపా 128 స్థానాలు గెలిచింది. శివసేన 63 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. భాజపా ఎక్కువ స్థానాలు గెలిచిన కారణంగా ఇరు పార్టీల సంబంధాలపై అనుమానాలు తలెత్తాయి.

ఈ సమావేశానికి కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రమంత్రి పంకజా ముండే గైర్హాజరయ్యారు.

శివసేన స్పందన

భాజపా ఎన్నికల సమావేశంపై స్పందించారు శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్​. రెండు పార్టీల మధ్య ముఖ్యమంత్రి పదవి అంశమై వివాదమేమి లేదని స్పష్టం చేశారు. కానీ సమానంగా అధికార పంపిణీ అంటే సీఎం పదవినీ పంచుకోవాలని సేన వర్గాలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: ఇమ్రాన్​పై 'పెద్దన్న' చిన్నచూపు.. నెటిజన్ల ట్రోల్స్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 21 July 2019
1. Belgian flag
2. Belgium's King Philippe and Queen Mathilde arriving for National Day parade, greeting guests
3. Prince Laurent and Princess Claire of Belgium arriving
4. Various of royal family on stage
5. Various of military orchestra
6. King Philippe and Queen Mathilde
7. Various of military jets in sky
8. Helicopter in sky carrying Belgian flag
9. Royals watching military vehicles driving past during parade
10. Military vehicles parked
11. King Philippe shaking hands with army veterans
12. Marching band
13. Soldiers marching
14. Various of tanks
15. Police officers marching during civil parade, which follows military parade
16. Modern police vehicle driving past
17. Firefighters marching
18. Royal Air Force marching band
19. Various of military orchestra playing for royals and guests
20. Various of King Philippe and Queen Mathilde greeting guests
21. Royal family leaving after parade
STORYLINE:
Belgium on Sunday marked its national day with a military parade in the capital, Brussels.
King Philippe and Queen Mathilde, joined by other members of the royal family, were amongst guests attending the popular celebration.
The military parade is held annually, showcasing a variety of military vehicles, accompanied by army veterans, soldiers on foot and marching bands.
A civil parade followed right after the military parade, featuring participants from the country's police and fire services, amongst others.  
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.