ఎన్నికల ముందు, తర్వాత భాజపాతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ కుమారస్వామికి పెద్ద మొత్తంలో లంచం ఎరజూపారని దేవెగౌడ ఆరోపించారు. ఎలాంటి ప్రలోభాలకు జేడీఎస్ లొంగలేదనే... చివరి అస్త్రంగా కేంద్రం ఐటీ దాడులు చేస్తోందని చెప్పారు.
"కుమరస్వామిని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల ముందు ఒత్తిడి తెచ్చారు. జేడీఎస్ ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఎర చూపారు. కుమారస్వామిని ముంబయి రమ్మన్నారు. అక్కడే డబ్బు ఉంది. ఇన్ని ప్రలోభాలకు లొంగకుండా కుమారస్వామి భాజపాతో పొత్తును ఎన్నికల ముందు, తర్వాత తిరస్కరించారు. ఇంతలా దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని నేనెన్నడూ చూడలేదు."
- హెచ్డీ దేవెగౌడ, మాజీ ప్రధాని
భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తనను కలవడానికి ప్రయత్నించారని దేవగౌడ తెలిపారు. అయితే తాను ససేమీరా ఒప్పుకోలేదన్నారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇంతలా దిగజారిన కేంద్రప్రభుత్వాన్ని చూడలేదని ఆరోపించారు. మోదీ ఎన్నికల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ప్రజలకు లెక్క చెప్పాలని దేవెగౌడ డిమాండ్ చేశారు.