ETV Bharat / bharat

'జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా వినియోగిస్తున్నారు' - జై శ్రీరామ్​

'జై శ్రీరామ్'​ నినాదాన్ని భాజపా తరచుగా వినియోగిస్తూ మతాన్ని రాజకీయంతో ముడివేస్తోందని ఆరోపించారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాజకీయాల కోసం జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీదీ.

జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా వినియోగిస్తున్నారు: మమత
author img

By

Published : Jun 2, 2019, 10:19 PM IST

Updated : Jun 2, 2019, 10:39 PM IST

'జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా వినియోగిస్తున్నారు'

బంగాల్​లో భాజపా లేవనెత్తిన 'జై శ్రీరామ్​' సెగ కొనసాగుతోంది. కాషాయ దళం కార్యకర్తలు జై శ్రీరామ్​ నినాదాన్ని వినియోగించటంపై తీవ్రంగా స్పందించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జై శ్రీరామ్​ నినాదంతో మతాన్ని భాజపా రాజకీయంలోకి లాగుతోందని మండిపడ్డారు దీదీ.

జై శ్రీరామ్​, జై రామ్​ జీ కీ, రామ్​ నామ్​ సత్య హై వంటి నినాదాలు మతపరమైనవని పేర్కొన్నారు దీదీ. వాటిని తాము గౌరవిస్తామన్నారు. కానీ జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా భాజపా ఉపయోగిస్తోందని ఆరోపిస్తూ తన ఫేస్​బుక్​ పోస్ట్​లో రాసుకొచ్చారు మమత. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు.

రాజకీయ ర్యాలీలు, పార్టీల కార్యక్రమాల్లో ప్రత్యేక నినాదాలు వినియోగిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. ఇతరులపై దౌర్జన్యంగా రాజకీయ నినాదాలను అమలు చేయాలనుకునే వారిని తాము గౌరవించమని తెలిపారు. ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేయాలనుకునే ప్రయత్నాలను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు దీదీ.

ఇటీవల రాష్ట్ర పర్యటనలో భాగంగా దీదీ వాహనం వెళుతున్న సమయంలో కొందరు జై శ్రీరామ్​ అంటూ నినాదాలు చేశారు. ఇలాంటి ఘటనలు రెండు చోట్ల ఎదురవటం వల్ల నినాదాలు చేసిన వారిపై దీదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'రామ నామం స్మరించండి'

రామ నామం తలుచుకోమని దీదీకి సూచించారు దిల్లీ భాజపా నేత ప్రవీణ్​ శంకర్​ కపూర్​. అలా చేస్తే మనసులో ఉన్న చెడు ఆలోచనలు తొలగిపోతాయన్నారు. ఈ మేరకు 'భగవాన్​ శ్రీ రామ్​ నామ్​ మంత్రా' పుస్తకాన్ని బహుమతిగా ఇస్తున్నట్టు లేఖ రాశారు. ఇటీవల బంగాల్​లోని పర్గనాస్​ జిల్లాలో జైశ్రీరామ్​ నినాదాలు చేసిన వారిపై మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేయటాన్ని ఆయన తప్పుపట్టారు .

ఇదీ చూడండి: 'దీదీకి 10 వేల జై శ్రీరామ్​ పోస్టుకార్డులు'

New Delhi, May 30 (ANI): All ten captains of the participating teams in the Cricket World Cup paid a visit to Queen Elizabeth on Wednesday. They also met Prince Harry at the Buckingham Palace in London. Board of Control for Cricket in India (BCCI) tweeted two pictures of the captains' meeting with the Queen. In one picture all captains can be spotted with Queen Elizabeth and in another picture, Queen can be seen greeting the captains. The Royal Family also posted a photo on Twitter of the meeting between the skippers and the Queen. Afghanistan cricket skipper Gulbadin Naib posted a captains' selfie on Twitter before meeting Queen Elizabeth. The visit came just before the opening ceremony held at the London Mall next to the Buckingham Palace. Many cricketing legends like Viv Richards, Anil Kumble, Jacques Kallis were involved in the opening ceremony. Nobel peace prize winner Malala Yousafzai represented Pakistan. A unique 60-second challenge was played during the opening ceremony in which all teams were given one minute to score the maximum runs. England came out as the winners as they scored 74 in one minute whereas India finished at the bottom as they scored just 19. England takes on South Africa in the opening match of the World cup today at the Oval in London.
Last Updated : Jun 2, 2019, 10:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.