దిల్లీ శాసన సభ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ వ్యూహాలు సిద్ధం చేసింది. 20 రోజుల్లో సుమారు 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో రోజుకు 3 లేదా 4 బహిరంగ సభలు నిర్వహించాలని భాజపా యోచిస్తోంది. రోజుకు దాదాపు 250 సభలు నిర్వహించాలని మొత్తంగా 20 రోజుల్లో సుమారు 5 వేల బహిరంగ సభలు జరపాలని నిర్ణయించింది.
ప్రజలతో మమేకమయ్యేందుకే...
ఒక్కొక్క సభకు 200 మందికి మించకుండా హాజరవుతారని భాజపా అంచనా వేస్తోంది. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకోవడానికే ఈ విధంగా చిన్న చిన్న సభలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సభల్లో కేంద్ర మంత్రులు, భాజపా అగ్ర నేతలు పాల్గొంటారు. కనీసం 10 బహిరంగ సభల్లో పాల్గొనాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని.. స్థానిక భాజపా నేతలు కోరినట్లు తెలుస్తోంది.
దిల్లీ శాసన సభలో 70 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుండగా... 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదీ చూడండి: 'లగే రహో'.. కేజ్రీపై నయా ప్రచార గీతం